ఢిల్లీలో మళ్లీ సరి-బేసి


Sat,September 14, 2019 12:55 AM

Odd and even back in Delhi after Diwali

న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం అమలుచేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. నవంబర్ 4 నుంచి 15 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని చెప్పారు. అలాగే శీతాకాలంలో సరిహద్దు రాష్ర్టాల్లోని పంట పొలాల్లో కొయ్యకాళ్లకు నిప్పుపెట్టకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అక్టోబర్‌లో 50-60 లక్షల కాలుష్య నిరోధక మాస్క్‌లను పంపిణీ చేస్తామన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు.

అవసరం లేదు: గడ్కరీ

ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కేంద్రం చేపడుతున్న పనులు, కార్యక్రమాల ఫలితాలు మరో రెండేండ్లలో వస్తాయని, దీంతో కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.

114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles