ఉలిక్కి పడ్డ హస్తిన


Mon,July 2, 2018 12:44 PM

Occult Angle Suspected After Family Of 11 Found Dead In Delhi Home

-ఉత్తర ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో కుటుంబం మృతి
-ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం
-హత్య కేసు నమోదు.. లభించని సూసైడ్ నోటు
-క్షుద్ర పూజల కోణంపై పోలీసుల నజర్.. క్రైం బ్రాంచ్‌కు కేసు
-ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ, జూలై 1: దేశ రాజధాని ఢిల్లీ నగరం ఉలిక్కి పడింది. ఒకే కుటుంబంలో 11 మంది అనుమానాస్పద రీతిలో మరణించడం ఢిల్లీ వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నార్త్ ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, నలుగురు మైనర్లతోపాటు 11 మంది ఆదివారం విగత జీవులయ్యారు. పది మంది మృతుల కండ్లకు గంతలు గట్టి ఉరితీసినట్లు ఉండగా, 75 ఏండ్ల వృద్ధురాలి మృతదేహం గదిలో పడి ఉన్నది. ఒకే కుటుంబానికి చెందిన ఆరేడుగురు మరణించి ఉంటారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి 11 మంది మృతి చెంది ఉన్నారు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గురు గోవింద్ సింగ్ దవాఖానకు ఎదురుగా ఉన్న ఇంటి సీలింగ్‌కు 10 మృతదేహాలు వేలాడదీసి ఉన్నాయి. ఆ కుటుంబంలో ఒకరు మిగతా పది మందిని చంపేసి, తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసు వర్గాలు తెలిపాయి.

అలా కానీ పక్షంలో మృతులంతా రాత్రి భోజనంలోనే మత్తు మందు కలుపడంతో అపస్మారక స్థితిలో పడిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ కుటుంబ హత్యకు ప్రణాళిక రూపొందించిన వారు కుటుంబ సభ్యులందరినీ ఉరి తీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయం కనిపెట్టిన మహిళ కేకలేయకుండా ఆమె గొంతు కోసి, పారిపోయి ఉంటారన్న సందేహం కూడా వ్యక్తం అవుతున్నది. ఇందులో కుట్ర కోణాన్ని కొట్టి పారేయలేమని పోలీసులు అన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్వాపరాలు తెలుస్తాయని చెప్పారు. హత్యా? ఆత్మహత్యా? అన్నది తేలలేదు. ఘటనాస్థలంలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే వారు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన తర్వాత మరణించినట్లు కనిపిస్తుండటంతో క్షుద్రపూజలు చేశారా? అని అనుమానిస్తున్నట్లు ఢిల్లీ నగర జాయింట్ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు.

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ నుంచి 22 ఏండ్ల క్రితం ఢిల్లీకి వలస

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం 22 ఏండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నదని స్థానికులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, రాజస్థాన్‌లోని మృతుల బంధువులతో సంప్రదిస్తున్నారు. తొలుత బురారీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తదుపరి దీని దర్యాప్తును క్రైంబ్రాంచ్‌కు అప్పగించారు. మృతుల్లో నారాయణ్ దేవి (77), కూతురు ప్రతిభ (60), కొడుకులు భావ్‌నీష్ (50), లలిత్ భాటియా (45), భావ్‌నీష్ భార్య సవిత (48), వారి పిల్లలు మీనూ (23), నీతూ (25), ధృవ్ (15) మరణించి ఉన్నారు. ఇంకా లలిత్ భాటియా భార్య టీనా (42), కొడుకు శివమ్ (15), ప్రతిభ కూతురు ప్రియాంక (33) కూడా మృతి చెందారు.

ప్రియాంక వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగిందని, ఈ ఏడాది చివరిలో పెండ్లి జరుగనున్నదని స్థానికుల కథనం. పోలీసు వర్గాల కథనం ప్రకారం గదిలో పడిఉన్న వృద్ధురాలిని గొంతు కోసి ఉంటారని తెలుస్తున్నది. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులేమీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ నేను ఇరుగు పొరుగు వారితో మాట్లాడాను. మృతుల కుటుంబం ఎంతో ప్రేమానురాగాలతో, అందరితో కలిసిపోతుందని వారు చెప్పారు. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూద్దాం అని అన్నారు.

తొలుత కిరాణా దుకాణం.. తర్వాత ైఫ్లెవుడ్ బిజినెస్

తొలుత కిరాణా దుకాణం నడిపిన ఈ కుటుంబం తర్వాత ైఫ్లెవుడ్ వ్యాపారంలో అడుగు పెట్టింది. మొదటి అంతస్తులో నివాసం ఉన్న ఈ కుటుంబం.. గ్రౌండ్ ఫ్లోర్‌లో షాప్ నడిపేవారు. ప్రస్తుతం వారింటికి మరమ్మతులు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇటీవలే దుకాణాన్ని వారు విక్రయించారని స్థానికుల సమాచారం. ఆదివారం పాల ప్యాకెట్ కొనేందుకు వచ్చిన పొరుగింటి వ్యక్తి షాప్‌కు తాళం వేసి ఉండటం గమనించాడు. పైన ఇంటి తలుపులు తీసి ఉండటంతో మొదటి అంతస్తులోకి వెళ్లి చూస్తే మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను వెంటిలేషన్ నుంచి వేలాడదీసి ఉండటంతో స్థానికులను అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

1578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles