భీమ్‌యాప్‌తో కొంటే అగ్గువకే పెట్రోల్, డీజిల్Thu,October 12, 2017 01:59 AM

లీటర్ పెట్రోల్‌పై 49 పైసలు, డీజిల్‌పై 41 పైసలు తగ్గింపు
bhimapp
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: మోటార్ వాహనాల వినియోగదారులకు శుభవార్త. భీమ్ యాప్ ద్వారా పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు రాయితీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లీటర్ పెట్రోల్‌పై 49 పైసలు, డీజిల్‌పై 41 పైస రాయితీ కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నంథనం బుధవారం ట్వీట్ చేశారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గత వారమే పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

299

More News

VIRAL NEWS