2000 నోటును నిలిపివేయం!

Thu,December 5, 2019 02:22 AM

-స్పష్టంచేసిన కేంద్రం

న్యూఢిల్లీ: చెలామణిలో ఉన్న రూ.2000 నోటు ను దశల వారీగా నిలిపివేయబోమని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రసుత్తం చెలామణిలో ఉన్న నగదులో రూ. 2000 విలువైన నోట్లు 31.18 శాతం ఉంటాయన్నారు. బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో దశలవారీగా రూ.2000 నోటును నిలిపేయాలని ప్రభు త్వం ఆలోచిస్తున్నదా? అన్న ఓ ఎంపీ ప్రశ్న కు అనురాగ్ ఠాకూర్ పై విధంగా సమాధానం చ్చారు. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి మొత్తం రూ.21,10,900 కోట్ల విలువ గల వివిధ నోట్లలో రూ.6,58,200 కోట్ల విలువైన రూ.2000 నోట్లు (31.18 శాతం) చలామణిలో ఉన్నాయన్నారు.

ఐపీసీ, సీఆర్పీసీ నిబంధనల సవరణలపై కమిటీ

ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)లలో తప్పనిసరి సవరణలు తీసుకువచ్చేందుకు సూచనలు కోరుతూ కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బుధవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్‌లో మూకదాడుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలన్న విషయమై పలువురు సభ్యులు వేసిన ప్రశ్నలకు అమిత్‌షా సమాధానం ఇచ్చారు. ఐపీసీ, సీఆర్పీసీల్లో తప్పనిసరిగా తేవాల్సిన సవరణలపై తమకు సిఫారసులు పంపాలని అన్ని రాష్ర్టాల సీఎంలు, గవర్నర్లకు లేఖలు రాసినట్లు చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు అందిన తర్వాత ఐపీసీ, సీఆర్పీసీలలో సవరణలపై తగు చర్యలు తీసుకుంటామని అమిత్‌షా అన్నారు. ఐపీసీ, సీఆర్పీసీలలో మార్పులు తేవాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

పోర్నోగ్రఫీ నియంత్రణపై ఫోకస్

ఇంటర్నెట్‌లో బాలలకు అశ్లీల సాహిత్యం, వీడియోలు (పోర్నోగ్రఫీ) అందుబాటులోకి రాకుండా నియంత్రించే విషయమై రాజ్యసభ సభ్యుల బృందం దృష్టి సారించనున్నది. ఈ బృందం వివిధ దర్యాప్తు సంస్థలు, భారతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్), సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సప్, ఫేస్‌బుక్ తదితర సంస్థల ప్రతినిధులతో చర్చించాలని నిర్ణయించింది. పది రాజకీయ పార్టీలకు చెందిన 14 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ గ్రూప్‌ను ఏర్పాటుచేశారు. రెండు రోజుల కిందట తొలిసారి ఈ గ్రూప్ సభ్యులు సమావేశమై ఈ అంశంపై ప్రాథమికంగా చర్చించారు. పౌర సమాజ సంస్థలు, నిపుణులు, తల్లిదండ్రులు, దర్యాప్తు సంస్థలు, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) తదితర సంస్థల ప్రతినిధులతో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.

238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles