వాజపేయి కృషిని నాశనం చేశారు


Sat,April 20, 2019 09:35 AM

No More BJP Atal Bihari Vajpayee funeral procession

- పాకిస్థాన్‌తో చర్చించే అవకాశాలను మోదీ చెడగొట్టారు
- పీవోకేతో వాణిజ్యం బంద్‌పై మెహబూబాముఫ్తీ వ్యాఖ్య
శ్రీనగర్, ఏప్రిల్ 19: భారత్-పాక్ మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు మాజీ ప్రధానమంత్రి వాజపేయి చేసిన కృషి మొత్తాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాశనం చేశారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబాముఫ్తీ ఆరోపించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తో వాణిజ్యాన్ని శుక్రవారం నుంచి నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమె మండిపడ్డారు. ఇది పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ అంశంపై భారత్-పాక్ మధ్య చర్చలు జరిపే వాతావరణం, రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యం పునరుద్ధరణకు సంబంధించి వాజపేయి చేసిన కృషి మొత్తాన్ని మోదీ తలక్రిందులు చేశారని మండిపడ్డారు.

వాజపేయి 2003లో ఇదే రోజున కశ్మీర్‌లో పర్యటించారని, శాంతి చర్చలకు రావాలంటూ పాకిస్థాన్‌కు చేయి అందించారని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడే ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం వాణిజ్యాన్ని నిలిపివేసి, ఆయన కృషిని బూడిదపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాజపేయి కృషి ఫలితంగానే ముజఫరాబాద్ రోడ్డు తెరుచుకున్నదని, ఇప్పుడు దానిని మూసివేయడం ద్వారా సమస్యను మళ్లీ మొదటికి తెచ్చారని విమర్శించారు. ముజఫరాబాద్ రోడ్డు మార్గం ద్వారా భారత్‌లోకి ఆయుధాలు, నకిలీ కరెన్సీ, మత్తు పదార్థాలు అక్రమంగా సరఫరా చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి ఈ మార్గంలో రాకపోకలు నిషేధించింది.

409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles