బీజేపీలో ‘220 క్లబ్’ లేదు


Thu,March 21, 2019 02:28 AM

No 220 club in BJP hoping to replace PM Modi

-అదంతా మీడియా వర్గాల ఊహాగానమే
-మళ్లీ మోదీ సర్కార్ ఏర్పాటవుతుంది: గడ్కరీ

న్యూఢిల్లీ, మార్చి 20: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బలం తగ్గుతుందని, తద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా మరో నేత తెరపైకి వస్తారని భావిస్తున్న 220 క్లబ్ బీజేపీలో లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇది కేవలం మీడియా వర్గాల ఊహాగానమేనని తోసిపుచ్చారు. లోక్‌సభలో బీజేపీ బలం 220 సీట్లలోపే ఉండాలని, తద్వారా ఎన్డీయే పక్షాల మద్దతుతో మోదీకాకుండా మరో బీజేపీ నేత ప్రధాని పదవిని చేపట్టాలని కమలం పార్టీలో కొంద రు భావిస్తున్నట్లు మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సంఖ్యా బలం తగ్గితే బీజేపీ నేత ల్లో గడ్కరీ ప్రధాని పదవికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా తెరపైకి రావచ్చన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అటువంటి చర్చేదీ జరుగలేదని, మోదీ నాయకత్వంలోనే బీజేపీ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని గడ్క రీ ఓ ఆంగ్ల వార్తాపత్రికతో మాట్లాడుతూ చెప్పారు. ఆరెస్సెస్‌తో మంచి సంబంధాలు ఉండటంతోపాటు మిత్రపక్షాలతో కలిసి పనిచేయగల నేతగా గడ్కరీని ప్రస్తావిస్తుండటంపై ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదన్నారు. అటువంటి లెక్కలు, అంచనాలను వేయను. నేను బీజేపీ కార్యకర్తనే. ఐదేండ్లు మోదీ నా యకత్వంలో చేసిన పనులతో ఈసారి కూడా బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుంది.

కనుక ఆ పరిస్థితేమీ ఉత్పన్నం కాదని నేను గట్టిగా భావిస్తున్నా అని గడ్కరీ తెలిపారు. బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన దాడులను, రామ మందిరం అంశాన్ని రాజకీయం చేయడం విచారకరమని, ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన దాడులకు రుజువులు చూపాలని డిమాండ్ చేయడం సముచితం కాదన్నారు. మన సైనిక బలగాల చర్యలకు రుజువులను అడుగుతూ వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తున్న విపక్షాలను చూసి జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. నరేంద్రమోదీని విమర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఉపయోగిస్తున్న భాష గర్హనీయమైనదని, రాజకీయాల్లో సరికొత్త దిగజారుడుకు నిదర్శనమని గడ్కరీ అన్నారు. ప్రధాని పీఠాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలి. ఆ పదవిలో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. మోదీపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు విచారకరం అని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో మోదీ ప్రభుత్వ రికార్డును చూసి ఓటర్లు బీజేపీకి మద్దతు తెలుపుతారని, వరుసగా రెండోసారి అధికారాన్ని అప్పగిస్తారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోయాయని, ప్రజలపై అవి సానుకూల ప్రభావాన్ని చూపి మోదీ నాయకత్వంపై మరి ంత మంచి నమ్మకాన్ని సృష్టించాయని గడ్కరీ తెలిపారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రభుత్వం ముందున్న అవకాశాలు చాలా స్వల్పమని, చర్చలు లేదా కోర్టు తీర్పు లేదా చట్టం ద్వారానే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.

324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles