భారత్‌కు చేరిన ముస్లిం మతగురువులు

Tue,March 21, 2017 02:26 AM

Sushma-Swaraj
న్యూఢిల్లీ: పాక్‌లో అదృశ్యమైన హజ్రత్ నిజాముద్దీన్ దర్గా పీఠాధిపతి సయీద్ అసీఫ్ నిజామీ, ఆయన మేనల్లుడు సూఫీ గురువు నజీమ్ అలీ నిజామీ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. వారు నేరుగా నిజాముద్దీన్ దర్గాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి తమను విడిపించినందుకు ఆమెకు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అసీఫ్ నిజామీ కొడుకు సాజిద్ నిజామీ మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌లోని కరాచీకి చెందిన ఉమ్మత్ అనే దినపత్రిక తమ ఇద్దరినీ భారత నిఘా సంస్థ రా ఏజెంట్లని, పాక్‌కు చెందిన ముత్తాహిదా ఖ్వామీ మూమెంట్ (ఎంక్యూఎం)తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిందన్నారు. దీంతో పాక్ అధికారులు తమను నిర్బంధించి విచారణ జరిపారని వారు చెప్పారు.

1056

More News

మరిన్ని వార్తలు...