17 ఎన్‌కౌంటర్లలో 3 బూటకమే


Sun,January 13, 2019 02:11 AM

Nine Police Officers Indicted In Three Fake Gujarat Encounters From 2002 To 2006

-గుజరాత్ సీఎంగా మోదీ హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్లపై నిగ్గుతేల్చిన జస్టిస్ బేడీ కమిటీ
-సుప్రీంకోర్టుకు తుది నివేదిక సమర్పణ

న్యూఢిల్లీ, జనవరి 12: ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002-2006 మధ్య ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో కొన్ని బూటకపు ఎన్‌కౌంటర్లు ఉన్నాయని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎస్ బేడీ నేతృత్వంలోని కమిటీ నిగ్గు తేల్చింది. 17 కేసులను దర్యాప్తు జరిపిన ఈ కమిటీ.. మూడు కేసుల్లో పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని సిఫారసు చేసింది. గుజరాత్ పోలీసు అధికారులు బూటకపు ఎన్‌కౌంటర్లలో సమీర్‌ఖాన్, కసమ్ జాఫర్, హాజీ ఇస్మాయిల్ అనే ముగ్గురు వ్యక్తులను హత్యచేశారని సుప్రీం కోర్టుకు సమర్పించిన తుది నివేదికలో జస్టిస్ బేడీ పేర్కొన్నారు. ఈ కమిటీ ముగ్గురు ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులు సహా మొత్తం తొమ్మిది మంది పోలీసు అధికారులను అభిశంసించింది. అయితే ఈ కేసుల్లో ఏ ఐపీఎస్ అధికారిని కూడా ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ కమిటీ సిఫారసు చేయలేదు. 2002-06 మధ్య గుజరాత్‌లో జరిగిన 17 ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు జరిపేందుకు జస్టిస్ బేడీ చైర్మన్‌గా సుప్రీంకోర్టు పర్యవేక్షక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను సీల్డ్ కవర్‌లో గతేడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కమిటీ తుది నివేదికను గోప్యంగా ఉంచాలని గుజరాత్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 9న తోసిపుచ్చింది. ఈ నివేదిక ప్రతిని బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్‌తోపాటు పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది.

665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles