నిషేధ పిటిషన్‌ను డిస్మిస్ చేయండి


Wed,April 24, 2019 02:36 AM

NIA and Sadhvi Pragya respond to call for election ban

-తప్పుడు పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోండి
-ఎన్‌ఐఏ కోర్టుకు ప్రజ్ఞాసింగ్ విజ్ఞప్తి

ముంబై, ఏప్రిల్ 23: లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు వీల్లేకుండా తనపై నిషేధాన్ని విధించాలని దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని భోపాల్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ముంబైలోని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం తన న్యాయవాది ద్వారా ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి వీఎస్ పదాల్కర్‌కు సమాధానమిచ్చారు. తనపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ తుచ్ఛమైనదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకుండా ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై విధించాలని కోరుతూ మాలెగావ్ పేలుళ్ల బాధితుని తండ్రి గురువారం కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ ప్రచారం కోసం పాకులాడుతూ రాజకీయ ఎజెండాతో పిటిషన్ దాఖలు చేసి విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాక న్యాయస్థాన గౌరవ మర్యాదలను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ప్రజ్ఞాసింగ్ ఆరోపించారు. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని, తప్పుడు పిటిషన్ దాఖలు చేసినందుకు అతనిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ అంశం గురించి మాట్లాడే అధికారం తమకు లేదని ఎన్‌ఐఏ సమాధానమిచ్చింది.

212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles