ప్రధానిని చూసి నవ్వుతున్నారు


Thu,May 16, 2019 01:30 AM

New Word I English Dictionary Rahul Gandhi Taunts PM With Modilie

- దేశాన్ని తానే నడుపగలనన్న భ్రమలో ఆయన ఉన్నారు: రాహుల్

బర్గారీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ దేశాన్ని ఒకే ఒక్కరు నడుపగలరని (అది తానేనని) మోదీ భావిస్తున్నారని, కానీ ఈ దేశాన్ని నడిపేది ప్రజలు అన్న విషయం ఆయనకు తెలియదన్నారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మోదీ అపహాస్యం (యూపీఏ హ యాంలో ఆర్థిక వ్యవస్థ నిద్రపోతున్నదని పేర్కొనడం) చేసి మాట్లాడేవారని, కానీ ఐదేండ్ల పాలన తర్వాత మోదీ ఇప్పుడు అపహాస్యం చేయడం మానేశారన్నారు. ఎందుకంటే ఇప్పుడు మోదీ తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ప్రజలు అనుకుంటున్నారని, ఆయన అనుసరిస్తున్న విధానాలను చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ లోక్‌సభ స్థానం పరిధిలోని బర్గారీలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం లో అవినీతి జరిగిందని, దీనిపై తనతో చర్చించే దమ్ము ప్రధానికి లేదని విమర్శించారు.

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, లక్షల మం ది నిరుద్యోగులుగా మారారని తెలిపారు. 2015లో సిక్కుల పవిత్ర గ్రంథం..ధరమ్ అవమానానికి గురైంది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్ల్లో ఇద్దరు పౌరులు మరణించారు. ఈ ఘటనల కారకులను వదిలిపెట్టం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని రాహుల్ పరోక్షంగా బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.

154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles