2024నాటికి కొత్త పార్లమెంట్ భవనం


Sat,September 14, 2019 02:09 AM

New Parliament building to come up by 2024 Puri

- వచ్చే ఏడాది పనులు మొదలు.. కేంద్ర మంత్రి పూరీ

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంపై మొట్టమొదటిసారిగా అధికారిక ప్రకటన వెలువడింది. 2024 నాటికి కొత్త పార్లమెంట్ భవనం నిర్మిస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ భవనం, ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం, సెంట్రల్ విస్టా పునరభివృద్ధిపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుల పనులు వచ్చే ఏడాది మొదలవుతాయని వెల్లడించారు. వీటికి సంబంధించిన టెండర్లను ఈ ఏడాది అక్టోబర్‌లో పిలిచే అవకాశం ఉన్నదని చెప్పారు. నిర్మాణ ప్రదేశం, భవన డిజైన్లు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయని వెల్లడించారు. 2024 నాటికి కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వస్తుందని, కేంద్రంలో ఆ ఏడాది ఏర్పడే కొత్త ప్రభుత్వం నూతన భవనంలో కొలువుదీరుతుందని పేర్కొన్నారు.

135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles