నేతాజీ మరణ రహస్యాన్ని ఛేదించండి


Fri,August 23, 2019 03:03 AM

Netajis daughter urges PM to arrange for DNA test on ashes kept in Japan temple

-జపాన్‌లోని చితాభస్మానికి డీఎన్‌ఏ పరీక్ష జరిగేలా నహకరించండి
-ప్రధాని మోదీని కోరిన నేతాజీ కుమార్తె అనిత బోస్

కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని ఆయన కుమార్తె అని తా బోస్ కోరారు. జపాన్‌లోని రింకోజీ ఆలయంలో నేతాజీకి చెందినవిగా చెబుతున్న చితాభస్మానికి డీఎన్‌ఏ పరీక్ష జరిగేలా సహకరించాలని గురువారం ఆమె విజ్ఞప్తి చేశారు. దీని కోసం ప్రధాని మోదీతోపాటు జపాన్ అధికారులను కలుస్తానని జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. బ్రిటిషర్లపై పోరాటానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసిన బోస్ 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని కొందరు.. ప్రమాదం నుంచి బయటపడి గుమ్‌నామీ బాబాగా యూపీలోని ఫైజాబాద్‌లో అజ్ఞాత జీవితం గడిపారని మరి కొందరు భావిస్తున్నారు. ఆగస్టు 18న బోస్ వర్ధంతి అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నివాళి అర్పిస్తూ చేసిన ట్వీట్‌పై విమర్శలు రావడంతో వెంటనే దానిని తొలగించింది. 1945 ఆగస్టు 18న తన తండ్రి మరణించారని భావిస్తున్నానని అనితా బోస్ అన్నారు. అయితే తన తండ్రి మరణంపై నెలకొన్న మిస్టరీ విడాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.

1055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles