నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదట!Mon,July 17, 2017 03:04 AM

-1947 వరకు బోస్ బతికే ఉన్నారట
-1947 డిసెంబర్ 11నాటి ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ నివేదికే సాక్ష్యమంటున్న ఫ్రెంచ్ చరిత్రకారుడు

చెన్నై, జూలై 16: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ నేటికీ వీడలేదు. బోస్ ఎలా మరణించారనే దానిపై స్పష్టతరావడం లేదు. పైగా నేటికీ భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై భారత ప్రభుత్వం షానవాజ్ కమిషన్ (1956), ఖోస్లా కమిషన్ (1970) ముఖర్జీ కమిషన్ (1999) నియమించినా, కచ్చితమైన నిర్ధారణకు రాలేక పోయింది. తాజాగా, ఫ్రెంచ్ చరిత్రకారుడు జే బీపీ మోరె కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నేతాజీ అసలు విమాన ప్రమాదంలో చనిపోలేదని, 1947 వరకు బోస్ బతికే ఉన్నారని మోరె చెప్తున్నారు. 1947 డిసెంబర్ 11న అప్పటి ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ ఇచ్చిన నివేదిక ఇందుకు సాక్ష్యమని ఆయన వాదిస్తున్నారు. ఇండోచైనా యుద్ధం నుంచి బోస్ తప్పించుకున్నా 1947 డిసెంబర్ 11 వరకు ఆయన ఆచూకీ తెలియరాలేదని నివేదికలో ఉన్నది. అంటే 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారనే వార్తలను ఫ్రెంచ్ ప్రభుత్వం ఎప్పుడూ ధ్రువీకరించలేదు అని ఆయన అంటున్నారు.
NetajiSubashSandhraBose

888

More News

VIRAL NEWS