ఘనంగా నెహ్రూ 128వ జయంతి వేడుకలు


Wed,November 15, 2017 12:18 AM

Nehru's 128th birthday celebrations

న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ 128వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ తొలి ప్రధానికి నా నివాళులు అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలకు శుభాకాంక్షలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇండో-ఆసియాన్ సదస్సులో పాల్గొనడానికి మనీలా వెళ్లిన ప్రధాని మోదీ ట్విట్టర్‌లో నెహ్రూకు నా నివాళులు అని ట్వీట్ చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్వీట్ చేస్తూ గొప్ప నేతకు నివాళులు. ఆయన సేవలను మనం గుర్తుతెచ్చుకోవాలి అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్, మాజీ ప్రధాని మన్మోహన్ కూడా నెహ్రూకు నివాళులర్పించారు.

113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS