ప్రకాశ్‌రాజ్‌కు కేజ్రీవాల్ మద్దతు


Fri,January 11, 2019 02:35 AM

Need People Like Prakash Raj In Parliament Tweets Arvind Kejriwal

న్యూఢిల్లీ: నటుడు ప్రకాశ్‌రాజ్ రాజకీయ ప్రవేశానికి తమ మద్దతు ఉంటుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. గురువారం ఢిల్లీలో కేజ్రీవాల్‌తో ప్రకాశ్‌రాజ్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తానని ఇటీవల ప్రకాశ్‌రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ప్రకాశ్‌రాజ్ వంటి వ్యక్తులు పార్లమెంట్‌లో అడుగుపెట్టడం అవసరం అని పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేస్తూ కేజ్రీవాల్‌తో పలు అంశాలు చర్చించాను. నా రాజకీయ ప్రయాణానికి ఆయన మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అని తెలిపారు.

424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles