రాహుల్‌కు మహిళా కమిషన్ నోటీసులు


Fri,January 11, 2019 02:39 AM

NCW issues notice to Rahul Gandhi over his sexist statement on Nirmala Sitharaman

-రక్షణమంత్రి సీతారామన్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో జారీ
న్యూఢిల్లీ: రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) గురువారం నోటీసులు జారీచేసింది. మంత్రిని ఉద్దేశించి రాహుల్ ద్వేషపూరిత, అనైతిక వ్యాఖ్యలు చేశారని కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. జైపూర్‌లో బుధవారం జరిగిన ఓ సభలో రాహుల్ ప్రసంగిస్తూ.. రాఫెల్ ఒప్పందంపై పార్లమెంటులో జరిగిన చర్చను ఉదహరించారు. 56 అంగుళాల ఛాతి ఉన్న కాపలాదారు (మోదీ) పారిపోయి ఓ మహిళకు చెప్పారు. సీతారామన్ జీ, నన్ను కాపాడండి. నన్ను నేను కాపాడుకోలేను.. అంటూ ఆయన ప్రాధేయపడ్డారు అంటూ సభలో రాహుల్ విమర్శలు గుప్పించారు. తనను తాను కాపాడుకోవడానికి ప్రధానికి ఒక మహిళ దొరికారంటూ ఎద్దేవా చేశారు. మీడియాలో వచ్చిన ఈ వార్తలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి, రాహుల్‌కు నోటీసులు జారీచేసింది. మరోవైపు రాహుల్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీచేయడం రాజకీయ ప్రేరేపితమని కాంగ్రెస్ విమర్శించింది.

441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles