రియల్టర్ సంస్థ వద్ద 3,000 కోట్ల నల్లధనం

Tue,December 3, 2019 01:36 AM

-ఎన్సీఆర్ పరిధిలో గతవారం ఐటీ దాడులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వద్ద ఇటీవల ఐటీ శాఖ నిర్వహించిన దాడుల్లో రూ.3000 కోట్లకు పైగా నల్లధనం దొరికినట్లు సమాచారం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సదరు సంస్థ పేరు వెల్లడించలేదు. కానీ అధికార వర్గాల కథనాన్ని బట్టి ఓరియంటల్ ఇండియా గ్రూప్‌పై ఐటీ దాడులు చేసినట్లు తెలుస్తున్నది. గత వారం ఈ గ్రూప్‌కు చెందిన 25కు పైగా ప్రదేశాల్లో ఐటీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో సదరు సంస్థ రూ.250 కోట్లకు పైగా లెక్కలు చూపని నగదు చెల్లింపులు జరిపినట్లు ఆధారాలు లభించాయి. లెక్కలు చూపని రూ.3.75 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశాం. రూ.3000 కోట్ల నల్లధనానికి పన్ను చెల్లింపులు జరిపేందుకు సదరు సంస్థ అంగీకరించింది అని సీబీడీటీ తన ప్రకటనలో పేర్కొంది.

1175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles