తొలి జాబితాను విడుదల చేసిన ఎన్సీపీ


Fri,March 15, 2019 02:39 AM

NCP announces first list of candidates Supriya Sule to contest from Baramati

బారామతి నుంచి బరిలో పవార్ కుమార్తె సుప్రియా సూలే
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలిజాబితాను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) గురువారం విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ కుమార్తె సుప్రి యా సూలే బారామతి స్థానం నుంచి పోటీ చేస్తారు. 12 మంది పేర్లతో విడుదలైన తొలి జాబితాలో స్వాభిమాని షెట్కారి సంఘటన్‌కు ఒక సీటు ల భించింది. ఎన్సీపీకి కంచుకోట బారామతి స్థానంలో సుప్రియ 2009 నుం చి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు శరద్‌పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ ప్రాతినిధ్యం వ హించారు. తొలి జాబితాలో సీటు ల భించిన ప్రముఖుల్లో సంజయ్ దినా పాటిల్ (ముంబై ఈశాన్యం), ఆనంద్ పరంజాపే (థానె), సునీల్ ఠాక్రె (రాయ్‌గఢ్) తదితరులు ఉన్నారు. శరద్‌పవార్ బంధువు పార్థ్ పవార్‌కు చోటు లభించలేదు. హట్కనన్‌గాలే నుంచి స్వాభిమాని షెట్కారి సంఘటన్ అధ్యక్షుడు రాజు షెట్టి పోటీ చేస్తారు. శుక్రవారం ఎన్సీపీ రెండో జాబితాను విడుదల చేసే అవకాశముంది. ఈసారి తాను పోటీ చేయడం లేదని శరద్‌పవార్ ఇప్పటికే ప్రకటించారు.

85
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles