సోనియా వ్యక్తిగత సహాయకుడు బీజేపీలోకి


Fri,March 15, 2019 02:35 AM

National Tom Vadakkan key Sonia Gandhi aide joins BJP

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముం దు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ వ్యక్తిగత సహాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భూభాగంలోని పుల్వామాపై పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడి జరిపారు. దీనికి ప్రతీకారంగా కేంద్రం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడులపై కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరు చాలా బాధాకరం. మన సైనికుల శక్తి సామర్థ్యాలను, సమగ్రతను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇది జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం. అందుకే ఆ పార్టీ నుంచి వైదొలిగి బీజేపీలో చేరాను అని తెలిపారు. కాంగ్రెస్ నుంచి వైదొలగడం బాధగా ఉన్నా తప్పడంలేదన్నారు. తమ అవసరాలకు వ్యక్తులను వాడుకోవడం.. అవసరం తీరా క వదిలేసే సంస్కృతి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నదన్నారు.

100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles