మోదీ ఓడిపోతుంటే.. మహా కూటములెందుకు?


Mon,February 11, 2019 01:37 AM

Narendra Modi to address rally in Tamil Nadu's Tirupur

-తమాషాలతో వారసత్వ రాజకీయాలకు విపక్షాల ప్రోత్సాహం
-కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రక్షణ కుంభకోణాలు
-తిరుపూర్ సభలో విపక్షాలపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
-తమిళనాడు, కర్ణాటకల్లో పలు అభివృద్ధి పథకాలకు మోదీ శంకుస్థాపన

తిరుపూర్/బెంగళూరు/హుబ్లీ, ఫిబ్రవరి 10: విపక్ష నేతలు చాలా తమాషాగా మాట్లాడుతున్నారు. మోదీ ప్రభుత్వం విఫలమైందని వారు చెబుతారు. మోదీ ఏమీ చేయలేదు. మోదీ ఘోరంగా ఓడిపోబోతున్నారని అంటున్నారు. కానీ వారు మోదీని ఓడించేందుకు పెద్ద కూటములు ఏర్పాటు చేస్తున్నారు. వారి పోరాట ఎజెండా ఏమిటి? ఎవరికీ తెలియదు. వారిది కేవలం మోదీ వ్యతిరేక పోరాటం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదివారం తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మోదీ.. తిరుపూర్‌లోని పెరుమనలూరులో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వణక్కం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. విపక్షాలు ప్రచారం కోసం పాకులాడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రక్షణ ఒప్పందాల్లో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. దేశ భద్రతను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. అనంతరం తిరుపూర్‌లో 100 పడకల ఈఎస్‌ఐ దవాఖాన నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయడంతోపాటు త్రిచి, చెన్నై విమానాశ్రయాల ఆధునీకరణ ప్రాజెక్టు పనులను, చెన్నై నౌకాశ్రయం నుంచి మనాలీ రిఫైనరీ కేంద్రం వరకు ముడి చమురు పైపులైన్ నిర్మాణ పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మోదీ పర్యటనను నిరసిస్తూ ఎండీఎంకే అధినేత వైకో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతగా భావిస్తున్న ఒక మహిళ వైకో సభలో ప్రవేశించి మోదీ అనుకూల నినాదాలు చేశారు. ఎండీఎంకే కార్యకర్తలు ఆమెను ఘెరావ్‌చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు పక్కకు తీసుకెళ్లారు.

మోదీ సర్కార్‌ది నీచ రాజకీయం: కుమారస్వామి


హుబ్లీ-ధార్వాడ్‌లో ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. మోదీ సర్కార్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆదివారం మీడియాతో అన్నారు. బీజేపీ కార్యక్రమం నిర్వహించుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ అధికారిక కార్యక్రమానికి రాష్ట్ర సీఎంను ఆహ్వానించాలన్న కనీస మర్యాదను కూడా పాటించలేదన్నారు. ధార్వాడ్‌లో ఐఐటీ భవన నిర్మాణానికి, గ్యాస్ పైపులైన్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తదుపరి హుబ్లీలో సభ ద్వారా కర్ణాటకలో ప్రధాని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నిజాయితీ పరులు తనను విశ్వసించాలని కోరారు. అవినీతి ఒక సమస్యేనని అంగీకరించారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతు న్నట్టుగానే కేంద్రంలో కూడా ఇటువంటి సర్కార్‌నే ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నయని విమర్శిం చారు. ప్రధాని పర్యటనపై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమానికి సీఎం కుమారస్వామిని ఆహ్వానించకపోవడం కన్నడిగులను కించపర్చడమేనని ఆరోపించారు.

1098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles