తప్పుడు హామీలతోనే మోదీ పాలనSun,August 13, 2017 01:26 AM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపణ
Rahul
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు హామీలతోనే కాలం గడుపుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగంలో 371 (జే) అధికరణానికి సవరణలో కీలక పాత్ర పోషించిన రాహుల్‌గాంధీని శనివారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పంట రుణాల మాఫీ తమ ప్రభుత్వ పాలసీ కాదని, రైతులను సోమరులను చేయదల్చుకోలేదని అన్నారని రాహుల్ గుర్తు చేశారు. ఇదే ప్రభుత్వం పారిశ్రామిక రుణాలు మాఫీ చేసినప్పుడు 10 మంది అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తలు సోమరులు కానప్పుడు రైతులు ఎలా సోమరులవుతారని రాహుల్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గె తదితరులు పాల్గొన్నారు.

329

More News

VIRAL NEWS