మోదీ దిగటం ఖాయం


Sat,April 20, 2019 02:22 AM

Narendra Modi a failed PM will definitely lose elections this time

- కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే
- బీజేపీని వ్యతిరేకించే పార్టీలదే విజయం
- కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ
రాయచూర్/చిక్కోడి, ఏప్రిల్ 19: ప్రధాని నరేంద్రమోదీని గద్దె దింపాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర కర్ణాటకలోని రాయచూరు, చిక్కోడి ప్రాంతాల్లో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలో ఇదే ఆయన చివరి ప్రచార షెడ్యూల్. రాష్ట్రంలో గురువారం తొలి విడుత ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 23న రెండో విడుత ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం రాహుల్ కర్ణాటకలో పర్యటించారు. రాయచూర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్.. ఇతర రాష్ర్టాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారే విజయం సాధిస్తారని చెప్పారు. ప్రస్తుతం నేను గుజరాత్ నుంచి వస్తున్నాను. గుజరాత్‌లో అంతర్లీనంగా కాంగ్రెస్‌కు సానుకూలత వ్యక్తమవుతున్నది. దేశాన్ని పక్కనపెడితే.. గుజరాత్‌కు మోదీ చేసిందేమీ లేదని ఆ రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. లక్షల ఎకరాల తమ భూములను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని రాహుల్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ దేశ భద్రత గురించి మాట్లాడుతున్నారని, అయితే కోట్లాది మంది యువతను నిరుద్యోగులుగా మిగల్చడం దేశాన్ని బలోపేతం చేయదన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని పోటీ నుంచి తప్పించడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. హిందుస్థాన్‌లో గురువును మించినది ఏమీ లేదు. ధర్మం గురించి మాట్లాడే ప్రధాని మోదీ.. అద్వానీకి ఏం చేశారో చూడండి. మోదీని నిలబడేలా చేసింది అద్వానీ. కానీ రెండు నిమిషాల్లో ఆయనను మోదీ పక్కకు తప్పించారు. కనీసం ఆయనకు నమస్తే చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. చూపు పక్కకు తిప్పుకున్నారు. మళ్లీ ఆయన ధర్మం గురించి మాట్లాడుతారు. ఇది నిజంగా సిగ్గుచేటు అని రాహుల్ ధ్వజమెత్తారు. ఒక్క హామీని కూడా మోదీ అమలుచేయలేదని ఆయన విమర్శించారు. కోట్లాది మంది ప్రజలను నాశనం చేశారని, దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. రాయచూర్ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.

482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles