సహచరులపై జవాన్ కాల్పులు

Thu,December 5, 2019 01:18 AM

-ఐదుగురు మృతి.. ఆత్మహత్యకు పాల్పడిన జవాన్
-సెలవు ఇవ్వలేదన్న కోపంతో దారుణం.. ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

చర్ల రూరల్: ఉన్నతాధికారులు సెలవు ఇవ్వలేదన్న కోపంతో విచక్షణ కోల్పోయిన ఓ జవాను.. తన సహచరులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. నారాయణపూర్ జిల్లా ఎస్పీ మోహిత్‌గార్గ్ ప్రకారం.. జిల్లాకేంద్రానికి 60 కి.మీ. దూరంలోని కడెనార్ అటవీ ప్రాంతంలో ఉన్న ఐటీబీపీ (ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్) క్యాంపులో రెహమాన్ అనే జవాను తన సహచరులైన ఏడుగురు జవాన్లపై కాల్పులు జరిపాడు. అనంతరం రెహమాన్ తుపాకీతో కాల్పుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహేంద్రసింగ్, బెంగాల్‌కు చెందిన సుర్జీత్ సర్కార్, బిశ్వరూప్ మహతో, పంజాబ్‌కు చెందిన దల్జీత్‌సింగ్, కేరళకు చెందిన బిజేష్ అక్కడికక్కడే మృతిచెందారు. రాజస్థాన్‌కు చెందిన సీతారామ్ ధూన్, కేరళకు చెందిన ఉల్లాస్ తీవ్రంగా గాయపడగా, వారిని రాయ్‌పూర్ దవాఖానకు తరలించారు. నిందితుడు మసుదుల్ రెహమాన్‌ది పశ్చిమ బెంగాల్ అని పోలీసులు తెలి పారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులు సెలవులు ఇవ్వడం లేదనే కారణంతోనే రెహమాన్ ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles