‘శారదా’ కేసులో నళినికి ఊరట


Sun,January 13, 2019 02:03 AM

Nalini Chidambaram Granted Protection From Arrest In Saradha Scam

-నాలుగు వారాలపాటు అరెస్టు చేయవద్దంటూ
-సీబీఐని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు

చెన్నై, జనవరి 12: శారదా చిట్‌ఫండ్ స్కాం కేసులో కేంద్రమాజీ మంత్రి చిదంబరం భార్య నళినికి ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ ఆమెను అరెస్టు చేయవద్దంటూ మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. శారదా చిట్‌ఫండ్ కేసులో భాగంగా శుక్రవారం సీబీఐ దాఖలు చేసిన ఆరవ చార్జిషీట్‌లో నళిని పేరును పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం విచారణ జరిపిన కోర్టు నాలుగు వారాలపాటు ఆమెను అరెస్టు చేయవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎగ్మూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరై ష్యూరిటీలు సమర్పించాలని, అనంతరం ఈ కేసును విచారిస్తున్న పశ్చిమబెంగాల్‌లోని కోర్టు నుంచి పూర్తిస్థాయి ముందస్తు బెయిల్ పొందాలని నళినికి సూచించింది. శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో నళిని రూ.1.4 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తున్నది. శారదా గ్రూప్ వ్యవస్థాపకులు సుదీప్తాసేన్‌తో కలిసి నళిని నిధుల దుర్వినియోగం చేయడంతోపాటు మోసపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కొంటున్నది.

394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles