లోయా కేసుతో విభేదాలు బహిర్గతం!Sat,January 13, 2018 02:36 AM

sutti
ఓవైపు సుప్రీంకోర్టు తన విధులు కొనసాగిస్తుండగానే, నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించారు. అత్యున్నత న్యాయస్థానం రెండు కీలక నియామకాలను ప్రకటించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రిజ్‌గోపాల్ లోయా మృతి చుట్టూ అల్లుకున్న పలు అంశాలను వివరించేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నామని మొదట జస్టిస్ గొగోయ్ మీడియాకు తెలిపారు. పలువురు పోలీస్ అధికారులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిందితుడుగా ఉన్న సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుపై విచారణ సాగించిన జస్టిస్ లోయా 2014 డిసెంబర్1న నాగ్‌పూర్‌లో గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందారు.

లోయా తన సహోద్యోగి కూతురు పెండ్లికి హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సొహ్రాబుద్దీన్ కేసుకూ, లోయా మృతికీ సంబంధముందంటూ ఆయన సోదరి అనుమానం వ్యక్తంచేయడంతో సందేహాలు తలెత్తాయి. ఈ అంశం శుక్రవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి చీఫ్‌జస్టిస్ కేసు విచారణను అప్పగించారు. అయితే ఈ కేసు కేటాయింపు విషయంలోనే శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని, దాని పరిణామమే కొద్దిసేపటి తర్వాత మీడియా ముందుకు రావడానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

493

More News

VIRAL NEWS