మరాఠాల బంద్ సంపూర్ణం


Fri,August 10, 2018 02:30 AM

Mumbais quota of bandh goes peaceful

-నిరసనకారుల ఆందోళనతో అట్టుడికిన మహారాష్ట్ర
-పుణె కలెక్టర్ కార్యాలయంపై దాడి..శరద్‌పవార్ ఇల్లు ముట్టడి

ముంబై: విద్య, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కొద్ది రోజులుగా డిమాండ్‌చేస్తూ ఆందోళనలు చేపడుతున్న మరాఠాలు గురువారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. రోడ్లపై టైర్లు కాల్చివేసి బస్సులు, ఇతర వాహనాల్ని అడ్డుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నిరసనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడుతారనే అనుమానంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతను కల్పించారు. పుణే జిల్లా కలెక్టర్ కార్యాలయంపై నిరసనకారులు దాడిచేశారు. బారామతి తహసీల్ పరిధిలోని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇంటిని మరాఠా కార్యకర్తలు ముట్టడించారు. పుణె, నాగ్‌పూర్, లాతూర్, జల్నా, ఔరంగాబాద్, బుల్దానా, అహ్మద్‌నగర్, షోలాపూర్ జిల్లాల్లో ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించి ట్రాఫిక్‌ను నిలిపివేశారు.

207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS