యముడున్నాడు జాగ్రత్త!

Mon,November 11, 2019 01:35 AM

ముంబై: ముంబైలోని రైల్వే స్టేషన్లలో పట్టాలపై నుంచి నడుచుకుంటూ వెళ్లేవారిని యమధర్మరాజు ఎత్తుకెళ్లిపోతున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పశ్చిమ రైల్వే ఉన్నతాధికారులకు వచ్చిన సరికొత్త ఆలోచన ఇది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన కొందరు సిబ్బందికి యమధర్మరాజు వేషం వేయించి రైల్వే స్టేషన్లలో నియమించారు. వారు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను పట్టించుకోకుండా ట్రాక్‌లపైనుంచి వెళ్తున్న ప్రయాణికులను గుర్తించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పట్టాలు దాటితే.. నిజంగానే యమధర్మరాజు దగ్గరికి వెళ్తారంటూ హెచ్చరిస్తున్నారు. మొదట్లో ముంబైలోని అంధేరి, మలాడ్ రైల్వే స్టేషన్లలో ఈ ఆలోచనను అమలు చేసి క్రమంగా విస్తరిస్తున్నారు. ముంబై సబర్బన్ పరిధిలో రైళ్లు ఢీకొని రోజూ సగటున 8-10 మంది చనిపోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పశ్చిమ రైల్వే పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు దాటినందుకు 13,463 మందిపై కేసులు నమోదుచేశారు.

1311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles