ఎస్పీలో కుదరని సంధిWed,January 11, 2017 01:46 AM

లక్నో/ న్యూఢిల్లీ: ఎస్పీ అధినేత ములాయం సింగ్, యూపీ సీఎం అఖిలేశ్ మధ్య రాజీకోసం ప్రయ త్నించిన ఆర్జేడీ ఫోన్ రాయబారం విఫలమైంది. ములాయంను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసా గించలేమని తమ మధ్య రాజీకి ప్రయత్నిం చిన ఆర్జేడీ అధినేత లాలూకు సున్నితంగానే యూపీ సీఎం అఖిలేశ్ చెప్పారని తెలుస్తున్నది.
Samajwadi
పార్టీ చీఫ్‌గా ములాయం ఉంటే ఎన్నికల వేళ అమర్‌సింగ్, శివ్‌పాల్ మాటలు వినే అవకాశం ఉందని లాలూ తో అఖిలేశ్ చెప్పినట్లు సమాచారం. ఎన్నికలయ్యాక సగౌరవంగా తండ్రిని జాతీయ అధ్యక్షుడిగా నియ మిస్తానని లాలూకు యువనేత వివరించారని తెలుస్తు న్నది. ములాయంను పార్టీ చీఫ్‌గా కొనసా గించాలని కోరినట్లు లాలూ కూడా మంగళవారం మీడియాతో చెప్పారు. కాగా, అఖిలేశ్ తండ్రి ములాయం నివాసానికి వెళ్లి 90 నిమిషాలు చర్చించాక మీడియా తో మాట్లాడకుండానే వెనుదిరి గారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) కలిసిన తర్వాత ములాయం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ తిరిగి విజ యం సాధిస్తే అఖిలేశే సీఎం అభ్యర్థి అని ప్రకటించడంతో వారిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ దఫా భేటీకి శివ్‌పాల్, అమర్‌సింగ్ దూరంగా ఉన్నారు.

మోటారు సైకిల్ కోరనున్న అఖిలేశ్?
ఒకవేళ ఈసీ తమకు సైకిల్ గుర్తు కేటాయించకపోతే ప్రత్యామ్నాయంగా మోటారు సైకిల్ గుర్తు కేటాయించాలని అఖిలేశ్ గ్రూపు కోరనున్నదని వార్తలు వచ్చాయి. ఎస్పీ ఎన్నికల గుర్తు సైకిల్ తండ్రీ కొడుకుల మధ్య ఎవరికి దక్కనున్నదని ఈ నెల 13న తేలనున్నది. ఈ మేరకు ఇరు గ్రూపులకు శుక్రవారం తమ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన ఈసీ.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నది. ఈ నెల 17 నుంచి తొలిదశ నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీ భావిస్తున్నది.

1143
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS