లోక్‌పాల్ నియామక కమిటీ సభ్యుడిగా ముకుల్ రోహత్గి


Wed,May 16, 2018 02:02 AM

Mukul Rohatgi appointed eminent jurist in Lokpal panel

mukul
న్యూఢిల్లీ, మే 15: లోక్‌పాల్ నియామకానికి సంబంధించిన సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని నియమించినట్లు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని లోక్‌పాల్ నియామక కమిటీలో ఓ న్యాయవాది సభ్యుడిగా ఉంటారు. అయితే ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న న్యాయవాది పీపీరావ్ గతేడాది సెప్టెంబర్‌లో మృతిచెందారు. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉన్నది. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని ఈ స్థానంలో నియమించినట్లు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS