అగ్రవర్ణాలకు రిజర్వేషన్.. పిచ్చి ఆలోచన


Thu,January 10, 2019 02:24 AM

Muddled Thinking Says Amartya Sen On 10 percent Reservation Policy

-తీవ్రమైన రాజకీయ, ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి
-నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ వ్యాఖ్య

కోల్‌కతా, జనవరి 9: ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించడం పిచ్చి ఆలోచన అని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా, ఆర్థికపరంగా తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పారు. పూర్వ యూపీఏ ప్రభుత్వం సాధించిన అధిక ఆర్థిక వృద్ధిని మోదీ ప్రభుత్వం నిలబెట్టుకున్నప్పటికీ.. దానిని ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, అందరికీ విద్య, వైద్యం కల్పించే దిశగా మార్చలేకపోయిందని అన్నారు. ఇక అగ్రకులాలలోని పేదలకు రిజర్వేషన్ కల్పించడం భిన్నమైన సమస్య అని చెప్పారు. జనాభా అంతటినీ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొని రావడమంటే.. రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయడమేనని పేర్కొన్నారు. అంతిమంగా ఇది ఒక పిచ్చి ఆలోచన అని ఆయన అభివర్ణించారు. ఆర్థిక వృద్ధి అధిక స్థాయిలో ఉన్నదని మోదీ ప్రభుత్వం చెప్పుకుంటున్నదని, కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నదని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలును కూడా అమర్త్యసేన్ విమర్శించారు.

1912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles