కులపోళ్లకు ముక్క పెట్టాలంతే!


Sun,June 16, 2019 02:36 AM

MP Panchayat asks rape survivors father to host dinner in village to purify daughter

- అప్పటి వరకు కుల, గ్రామ బహిష్కరణే
- లైంగికదాడి బాధితురాలి తండ్రికి కులపెద్దల షరతు


రాజ్‌గఢ్: కులపోళ్లను పిలిచి మాంసాహార విందు ఇస్తేనే లైంగికదాడికి గురైన కుమార్తెకు శుద్ధి చేసినట్టు అవుతుందని మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయితీ పెద్దలు తీర్మానించారు. ఓ తక్కువ కులానికి చెందిన వ్యక్తి చేతిలో లైంగికదాడికి గురైందన్న కారణంతో బాధితురాలి తండ్రికి షరతులు విధించారు. ఈ ఏడాది జనవరిలో ఓ 16 ఏండ్ల బాలిక ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పట్లోనే నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు జుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా పెద్దల పంచాయితీపై బాలిక కుటుంబసభ్యులు గురువారం మహిళా, శిశుసంక్షేమ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టామని, బాధితురాలి తండ్రి ఆరోపణల్లో వాస్తవంలేదని అధికారులు తేల్చిచెప్పారు.

1149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles