తెరుచుకున్న విద్యాసంస్థలు


Tue,August 20, 2019 02:26 AM

Most educational institutions reopen in Jammu border districts

-ఐదు సున్నిత సరిహద్దు జిల్లాల్లో బడులు తిరిగి ప్రారంభం
-కశ్మీర్‌లో నామమాత్రమే
-జమ్ముకశ్మీర్‌లో పరిస్థితిపై అమిత్‌షాకు వివరించిన దోవల్

జమ్ము/శ్రీనగర్: జమ్ములో ఆంక్షలను అధికారులు పూర్తిస్థాయిలో ఎత్తివేయడంతో సున్నితమైన ఐదు సరిహద్దు జిల్లాల్లో పక్షం రోజుల తర్వాత విద్యాసంస్థలు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల 4 నుంచి రాష్ట్రం లో ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. పరిస్థితులు సద్దుమణగడంతో జమ్ములో ఆంక్షలు ఎత్తివేయగా, కశ్మీర్‌లో మాత్రం కొనసాగిస్తున్నారు. కశ్మీర్‌లో ఆంక్షలను సడలించడంతో చాలా వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరైనా విద్యార్థులు మాత్రం పెద్దగా హాజరుకాలేదు రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న హింసాత్మక నిరసనల నేపథ్యంలో వరుసగా 15వ రోజూ నగరంలో ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. కాగా, జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సోమవారం హోం మంత్రి అమిత్‌షాను కలిసి వివరించారు.

విపరీతార్థాలు తీస్తే మీకే నష్టం: సోనమ్


Sonam-Kapoor
జమ్ముకశ్మీర్‌పై ఇటీవలి తన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్ విమర్శకులకు గట్టిగా జవాబిచ్చారు. దయచేసి శాంతించం డి. తప్పుగా అర్థం చేసుకుని వక్రభాష్యంతో విపరీతార్థాలు తీయడం వల్ల మీపైనే ప్రభావం పడుతుంది. కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకుని మీరేంటో తెలుసుకోండి అని ట్వీట్ చేశారు. కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి రద్దుపై ఇటీవల బీబీసీ ఇంటర్వ్యూలో సోనమ్ స్పందిస్తూ.. ప్రస్తుతం అక్కడ్ని పరిస్థితులను చూసి నా గుండె ముక్కలవుతున్నది. నాకు చాలా దేశభక్తి ఉన్నది. ప్రస్తుతం ప్రశాంతంగా ఉండి, దీన్ని అలా ముందుకు సాగనివ్వడమే మంచిదనిపిస్తున్నది అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు ఆమె మీద విమర్శలు గుప్పించారు.

171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles