Telangana Intermediate 1st & 2nd Year Results 2019

అనంతలో టీడీపీకి బీటలు


Wed,March 20, 2019 03:15 AM

More People Join YCP Party in Andhra Pradesh

-వైసీపీలోకి పెరుగుతున్న వలసలు
ఏపీలోని అనంతపురం జిల్లాలో 2014 ఎన్నికలతో పోలిస్తే పూర్తిగా భిన్న వాతావరణం కనిపిస్తున్నది. మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలున్న ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో 12 ఎమ్మెల్యే స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలను టీడీపీ కైవసం చేసుకున్నది. కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా బీటలువారుతున్నది. ఇప్పుడు జిల్లాలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. దేశంలో జైసల్మెర్ తర్వాత కరువుతో విలవిలలాడే అనంతపురం జిల్లాలో కనీసం సాగునీటి వసతి కూడా కల్పించలేదు. వానకాలంలో కొద్దిరోజులు రెయిన్ గన్ల హడావుడి తప్ప చేసిందేమీ లేదు. ఇక్కడ ఉన్న హిందూపురం, అనంతపురం పార్లమెంట్ స్థానాలున్నాయి. అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధి లో అనంతపురం, శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొం డ, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్ల్లీ స్థానాలున్నాయి. హిం దూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో మడకశిర, పెనుగొండ, రాప్తాడు, హిందూపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కదిరి, ఉరవకొండ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలుగా చాంద్‌బాషా, విశ్వేశ్వరరెడ్డి గెలిచిన తర్వాత టీడీపీలో చేరారు. మడకశిర ఎమ్మెల్యే ఈరన్నపై హైకోర్టు అనర్హత వేటు వేసి తిప్పే స్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించింది.

హంద్రీనీవా ఉన్నా ఆయకట్టు సున్నా

2012 నుంచి హంద్రీనీవా ద్వారా జిల్లాకు కృష్ణాజలాలు వస్తున్నాయి. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా సగటున 25 టీఎంసీల నీళ్లు వస్తున్నా, ఆయకట్టుకు మాత్రం నీళ్లు ఇవ్వలేదు. డిస్ట్రిబ్యూటరీలు రద్దుచేయాలని 2015 ఫిబ్రవరిలో జీవో 22 జారీచేశారు. ఈ కారణంగా 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందక అక్కడి భూములు బీళ్లుగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు బీజం పడినా చంద్రబాబు దానిని ముందుకు తీసుకెళ్లలేకపోయారు.

కియాతో ఎవరికి లబ్ధి?

అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద ప్రతిష్ఠాత్మక కియా మోటర్స్ వచ్చినా జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపాధి అవకాశాలు అందించలేకపోయారు. అక్కడి కార్మికులు, ఉద్యోగుల్లో ఎక్కువ శాతం బయటివారే ఉన్నారు. దీనిపై స్థానికులు తమకు ఉపాధి కల్పించని పరిశ్రమలు మాకు వద్దని ఆందోళనకు దిగారు. కియా వల్ల అక్కడి ప్రజల కంటే ఎక్కువ లబ్ధి పొందింది అధికార పార్టీ నాయకులే. ఆ ప్రాంతానికి కియా మోటర్స్ సంస్థ వస్తున్నదని ముందుగానే గ్రహించి టీడీపీ నేతలు రైతుల వద్ద అతిచౌకగా భూములు కొట్టేసి రూ.కోట్లకు అమ్ముకున్నారు. ఈ కారణంగా నష్టపోయిన రైతులు ధర్నాలు చేసినా బాబు పట్టించుకోలేదు.

రౌడీయిజం, ఫ్యాక్షనిజం పెచ్చుమీరాయి

రౌడీయిజం, ఫ్యాక్షనిజం పెచ్చు మీరాయి. అధికార పార్టీ నేతలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ధర్మవరం నియోజకవర్గంలో పాగా వేసేందుకు ఆర్వోసీ పేరుతో రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టారని విమర్శలు వచ్చాయి. జిల్లాలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా ధర్మవరం రికార్డులోకి ఎక్కింది. టీడీపీ ఎమ్మె ల్యే సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ఇటీవలే ఎన్నికల అనంతరం ప్రత్యర్థులను తరిమి తరిమి చంపుతామని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ధర్మవరం ఎమ్మెల్యే ఒక్క రే ఇసుక కాంట్రాక్టులు, సెటిల్మెంట్లతో ఈ ఐదేండ్లలోనే వెయ్యి కోట్లు సంపాదించారని ఆరోపణలున్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ సోదరుల ప్రాబల్యం తగ్గలేదు. కాగా, ప్రస్తుతం టీడీపీ బీటలు వారుతూ వైసీపీలోకి వలసలు పెరిగాయి.

సదురుకో బాబూ.. సదురుకో!

మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందే.. ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నది.
సింహం సింగిల్‌గా వస్తుంది.. కేసీఆర్ విజయం తథ్యం అని ప్రజలు నమ్మినా బాబుచాటు మీడియా నమ్మలేకపోయింది. పనికట్టుకొని కట్టు కథల భజన బృందాన్ని వెంటేసుకొని పిప్పీపీ అంటూ బాకాలూదింది.
అదే బ్యాచ్.. అదే భజన బృందం ఇప్పుడు ఆంధ్రాలోనూ మోపయి బాకాలూదేందుకు ఉబలాట పడుతున్నది.
కుట్రల రాతలను.. కుటిల పెప్పర్‌స్ప్రే సర్వేలను ప్రజలు తిప్పికొట్టినా బుద్ధి రాకపోగ.. మల్లా రింగ రింగా అంటూ రికార్డింగ్ డ్యాన్సులు చేస్తూ పాకులాడుతున్నది.
నాడు తెలంగాణలో ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు గూమిగూడి వచ్చి కనీసం చారాణా మందం సీట్లు సాధించలేకపోయిన గొప్ప బ్యాచ్ ఇది.
నేడు ఆంధ్రాలో కూడా జరుగబోతున్నదీ అదేనని ప్రజలనుకుంటున్నరు.
తెలంగాణలో చేసినట్లే బాబు తాను ఎన్ని కుట్రలు చేసినా.. తన మీడియాతో ఎన్ని అబద్దాలు ప్రచారం చేయించినా ఈసారి కాపాడుకోవడం కష్టం అనే సత్యం తెలుసుకుంటే బాబుకు మంచిది.. బాకాలకు కూడా మంచిదే.
ప్రజలు.. లీడర్లు ఇది ముందుగానే తెలుసుకున్నరు. వైసీపీ విజయం లాంఛనమే అని గ్రహించి అధికార పార్టీలోంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి కార్యకర్తల దాకా జగన్‌కు జై కొడుతున్నరు.
ఇదే ఇప్పుడు బాబుగారి ఆస్థాన పత్రికలకు తలనొప్పిగా మారింది.
ఏదో ఒకటి చేయాలనే కలువరింతల్లోంచి వార్తలు రాస్తూ ఆనందం పొందుతున్నది.
నాయుడిగారి నాటక పత్రికల్లో మొదటిది.. బాబు అంటే మోజు తీరనిది అయిన ఓ పత్రిక ఇటీవల ఆంధ్రా ఎడిషన్‌లో రంగులు మార్చుకుంటున్న రథ చక్రాలు అని ఓ వార్త ప్రచురించింది.
చాలా గమ్మత్తయిన విషయం ఏంటంటే.. తెలంగాణ ఎడిషన్‌లోనూ బాబుగారి ఏడుపు వార్తలు రాసే అలవాటు ఆ పత్రికకు జన్మతః ఉన్నది.
బాబుకు ప్రతికూలాంశం ఎంత పెద్దదైనా ఆ పత్రికకు పతాక శీర్షికకెక్కదు.. అంతకంటే ముందు పేపర్‌కే ఎక్కదు.
నాడు.. టీఆర్‌ఎస్ మీద అవాకులు.. చెవాకులు పేలుస్తూ ఆంధ్రా సీఎం ఇచ్చిన హెలికాప్టర్‌లో ఎక్కి తిరిగిన బాబు గుమస్తా రేవంత్‌రెడ్డి గురించిగానీ.. అసలు ఆ హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? బాబు ఎందుకు ఇచ్చాడు? ఖర్చు ఎంత? అనే విషయా లు ఏ బిట్టు రూపేణా కూడా రాసిన పాపాన పోలేదు ఆ బాబు పత్రిక.
జనాలు అదే అడుగుతున్నారు.. ఎందుకు రాయలేదు? అని.
బాబుతో దోస్తానా చేసి ఆయన అనుంగు మీడియాకు అన్నీ పచ్చగానే కనిపిస్తున్నట్టున్నాయి. లక్షణాలు కూడా అవే వచ్చినట్టున్నాయి.
అందుకే పొద్దున లేచింది మొదలు.. పక్క రాష్ట్రంపై పడి ఏడవడం తప్పిస్తే వేరే పనే లేనట్టు బాబుకు ఊదరగొడుతుంటాయి.
అయినా ఆంధ్రా ప్రజలకు తెలియదా? ఎవరిని అందలమెక్కించాలో.. ఎవరిని అధః పాతాళానికి తొక్కాలో!
బాబూ.. నీ బాకాలూదే బ్యాచ్‌తో కత్తెర్లు, కట్టర్లు పట్టుకొని రెడీగా ఉండు.. రిటర్న్‌గిఫ్ట్ ప్యాక్‌లో ఏముందే సూద్దువు.. సదురుకో ఇగ.. నీతోని కష్టంగానీ సదురుకో!
- గడ్డం సతీశ్

ఆ ఊర్లో మహిళ ఓటేయడం మొదటిసారి

women-India
అది రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ కుగ్రామం. ఆ గ్రామంలో వందల మంది మహిళలున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా వారికి ఓటు అంటే తెలియదు. ఓ తెగకు చెందిన మహిళలంతా ఓటు వేయడానికి పూర్తి వ్యతిరేకంగా ఉండేవారు. 2013 డిసెంబర్‌లో ఎలక్షన్ కమిషన్ వారికి అవగాహన కల్పించి, ఓటు విలువ తెలిపింది. మొదటిసారి వారు 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా ఆ గ్రామంలోని మహిళలు, యువతులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు.

మొదటి థర్డ్‌జెండర్ జనాభా లెక్కింపు ఎక్కడ?

INDIA-TRAN
ఎన్నికల కమిషన్ చరిత్రలో మొదటిసారిగా థర్డ్ జెండర్స్ జనాభాను 2014లో లెక్కించింది. వీరు మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఇచ్చిం ది. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్వీప్ విభాగం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిం ది. ప్రత్యేకంగా థర్డ్‌జెండర్స్‌ను గుర్తించి వారు ఓటు వేసేలా ప్రోత్సహించింది. స్వీప్ విభాగం గణన ప్రకారం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో అత్యధికంగా 93.75 శాతం ఓటు వేసేలా కృషి చేసింది. కల్యాణ్, థానే, ముంబాయి, పూణే, సోలాపూర్, పాల్గర్, నాసిక్ జిల్లాలోనూ థర్డ్ జెండర్స్ ఓటు వేసేలా స్వీప్ విభాగం అనేక కార్యక్రమాల ద్వారా ఓటుపై అవగాహన కల్పించింది.

459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles