మొదలైన రుతుపవనాల తిరోగమనం

Thu,October 10, 2019 02:56 AM

- నెల రోజులు ఆలస్యం: ఐఎండీ


న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల తిరోగమనం బుధవారం మొదలైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రికార్డుస్థాయిలో దాదాపు నెల రోజులు ఆలస్యంగా రుతుపవనాలు వెనుదిరినట్టు వెల్లడించింది. ‘నైరుతి భారతదేశం వ్యాప్తంగా వాతావరణ పైపొరల్లో నిలకడగా కొనసాగుతున్న తుఫాను వ్యతిరేక ప్రసరణము, కిందిపొరల్లో తేమశాతం క్రమంగా తగ్గడం, వర్షపాతం తగ్గిపోవడాన్ని బట్టి బుధవారం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైనట్టు గుర్తించాం. పంజాబ్‌, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర రాజస్థాన్‌ నుంచి రుతువపనాలు వెనక్కి మళ్లాయి’ అని ఐఎండీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. మరో రెండు రోజుల్లో నైరుతి భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో తిరోగమన అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఆ తర్వాత రెండుమూడురోజుల్లో మిగతా ప్రాంతాలతోపాటు మధ్యభారత్‌లో అనుకూలత ఏర్పడుతుందని వివరించింది. సాధారణంగా సెప్టెంబర్‌ 1న రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని, ఈసారి దాదాపు నెల రోజులు ఆలస్యమైనట్టు వెల్లడించింది.

207
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles