మీ ప్రకటనలకు డబ్బు ఎక్కడిది?


Tue,April 16, 2019 11:20 AM

Money For NYAY To Come From Pockets Of Fugitive Businessmen

-మోదీ ఎన్నికల ప్రచారంపై రాహుల్ నిలదీత
-నీరవ్ మోదీ, మాల్యా తదితరులే ఆయనకు ఇచ్చారని ఆరోపణ
-అధికారంలోకి రాగానే కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ
ఆగ్రా, ఏప్రిల్ 15: టీవీల్లో వచ్చే ముప్పై సెకండ్ల ప్రకటనకు కూడా లక్షల్లో ఖర్చవుతుందని.. టీవీ, వార్తాపత్రికలు ఎక్కడ చూసినా మోదీ ప్రకటనలేనని, ఈ డబ్బంతా ఎక్కడ నుంచి వస్తున్నదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ తరుఫున సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఎక్కడ చూసినా మోదీ గురించి ప్రచారమే. ఆ ప్రచారానికి డబ్బంతా ఎక్కడి నుంచి వస్తున్నది? టీవీల్లో ముప్పై సెకండ్ల ప్రకటనకు లేదా పేపర్లో ఏదైనా ప్రకటన ఇస్తే.. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బంతా మోదీకి ఎవరిస్తున్నారు? ఆయన జేబు నుంచైతే పెట్టుకోవట్లేదు అంటూ రాహుల్ ధ్వజమెత్తారు. దేశ ప్రజల సొమ్మును దోచుకొని ఆ డబ్బునంతా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి, లలిత్ మోదీ, విజయ్ మాల్యా లాంటి పారిపోయే వ్యాపారవేత్తలకు ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతీ భారతీయ పౌరుడి ఖాతాలో రూ. 15లక్షలు వంటి అసత్య వాగ్దానాలతో మోదీ అధికారంలోకి వచ్చారని రాహుల్ విమర్శించారు.

మోదీ భారత రైతుల ఉసురు తీశారు. తప్పుడు వాగ్దానాలతో ఆయన అధికారంలోకి వచ్చారు. ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15లక్షలు వేస్తానని మోదీలా నేను తప్పుడు హామీలు ఇవ్వను. ఆచరణాత్మక మొత్తాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. దేశంలో పేద వారి ఖాతాల్లో న్యాయ్ పథకం కింద రూ. 72వేలు వేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. న్యాయ్ పథకం ద్వారా అందించే డబ్బును ఎక్కడి నుంచి తీసుకువస్తారని మోదీ అడుగుతున్నారని.. ఇప్పటి వరకు అనిల్ అంబానీ, మెహుల్ చోక్సి, నీరవ్ మోదీ లాంటి వారి జేబుల్లోకి వెళ్లిన డబ్బును వసూలు చేసి, న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇప్పుడు ఖాళీగా ఉన్న 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు పంచాయతీల స్థాయిలో మరో 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఆయన చెప్పారు. మోదీ మంచి రోజులు రానున్నాయి అనే నినాదంతో అధికారంలోకి వచ్చారని, కానీ.. గడిచిన ఐదేండ్లలో ఆ నినాదం చౌకీదార్ దొంగగా మారిందని ఎద్దేవా చేశారు. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో మరో ఆరు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles