కూతురికి తల్లి గర్భాశయం దానంSat,May 20, 2017 02:04 AM

- దేశంలో మొదటిసారిగా శస్త్రచికిత్స

womb-transplant
పుణె, మే 19: పుట్టుకతోనే గర్భాశయం లేని ఆ మహిళ (21) అందరిలాగే పెండ్లి చేసుకున్నది. కానీ పిల్లలను దత్తత తీసుకోవడమో, సరోగసి ద్వారా కనేందుకో ఇష్టపడలేదు. దీంతో తన తల్లి గర్భాశయాన్ని ఆమెకు అమర్చి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. గురువారం పుణెలోని గెలాక్సీ కేర్ లాప్రోస్కోపి ఇన్‌స్టిట్యూట్‌లో డాక్టర్ శైలేశ్ నేతృత్వంలో 12మంది వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మధ్యాహ్నం 12కు ప్రారంభమైన శస్త్రచికిత్స రాత్రి 9.15 గంటలకు ముగిసింది. 9.15 గంటలపాటు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని డాక్టర్ శైలేశ్ పేర్కొన్నారు. గర్భాశయ మార్పిడి చికిత్స గురించి తెలుసుకొని వారు తనను సంప్రదించారని ఆయన చెప్పారు. ఆమె తల్లి గర్భాశయం సరిపోయిందని, అందుకు తల్లి ఒప్పుకోవడంతో శస్త్రచికిత్స చేశామన్నారు. ప్రస్తుతం ఆమె తమ పరిశీలనలో ఉన్నారని, మరికొద్దిరోజులు ఐసీయూలో ఉంచుతామని చెప్పారు. ఇది దేశంలోనే మొదటి గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్స అని తెలిపారు. 2013లో స్వీడన్‌లో మొదటి గర్భాశయ శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రపంచంలో ఇప్పటివరకు 25 శస్త్రచికిత్సలు జరిగాయని ఆయన వెల్లడించారు.

1421

More News

VIRAL NEWS