భారత్‌ హిందూ దేశమే!

Thu,October 10, 2019 02:27 AM

- భారతీయులందరూ హిందువులే: మోహన్‌ భాగవత్‌


నాగ్‌పూర్‌, అక్టోబర్‌ 8: భారత్‌ హిందూ దేశమేనని, ఈ విషయంలో ఆరెస్సెస్‌ కృతనిశ్చయంతో ఉన్నదని ఆ సంస్థ అధిపతి మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరంలోని రేషిమ్‌భాగ్‌ మైదానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో భాగవత్‌ పాల్గొని మాట్లాడారు. ‘దేశ గుర్తింపు, మనందరి సామాజిక గుర్తింపు.. వీటన్నింటికి సంబంధించి సంఘ్‌ ఆలోచనాధోరణి స్పష్టంగా, నిశ్చయంగా ఉన్నది. అది భారత్‌ హిందూస్థాన్‌.. హిందూదేశం’ అని పేర్కొన్నారు. దేశంలో శాంతి నెలకొనేందుకు కృషి చేస్తున్న ప్రతి భారతీయుడూ హిందువేనని చెప్పారు. దేశంలో మూకహత్యలు పెరిగిపోతున్నాయన్న ప్రతిపక్షాల ఆందోళనపై స్పందిస్తూ.. ‘ఇది (మూకహత్యలు) పశ్చిమ దేశాలకు, అక్కడి మతాలకు చెందిన భావజాలం. మనది సోదరభావంతో నిండిన దేశం. భారత్‌ ప్రతిష్ఠను మసకబార్చేందుకు ఇలాంటి పదాలు ఉపయోగించొద్దు’ అని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాగవత్‌ మండిపడ్డారు.

184
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles