మరో 25 ఏండ్లు మోదీయే ప్రధాని


Thu,May 16, 2019 01:26 AM

Modi will stay the pm for 25 years said Yogi Adityanath

- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

గోరఖ్‌పూర్ (ఉత్తర్‌ప్రదేశ్): సోషలిస్టు నాయకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆశయాలను ప్రధాని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని, మరో 25 ఏండ్లపాటు మోదీనే ప్రధానిగా ఉంటారని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జోస్యం చెప్పారు. బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తర్‌ప్రదేశ్‌లో 2014లో సాధించిన సీట్లకన్నా ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తాం. మొత్తం 80 ఎంపీ స్థానాలకు గాను అప్పట్లో 71 స్థానాల్లో గెలిచాం. ఇప్పుడు మరో మూడు స్థానాలను ఎక్కువగా గెలువబోతున్నాం. స్పష్టమైన మెజారిటీతో మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడనుంది అని చెప్పారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలు వేరని, ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు వేరని తెలిపారు. ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్, పుల్‌పూర్, అమేథీ, ఆజంగఢ్, బదౌన్ నియోజకవర్గాల్లో కూడా గెలువనున్నామని వివరించారు.

140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles