ప్రధానిని పొగడాల్సిన అవసరం లేదు


Mon,August 26, 2019 01:43 AM

Modi Turning India into Demon Land Congressmen Praising Him Should be Thrown Out of Party

-థరూర్‌ను తప్పుబట్టిన కేరళ కాంగ్రెస్‌ నేతలు
అలప్పుజ/ తిరువనంతపురం: ప్రధాని నరేంద్రమోదీ చేసే మంచి పనులకు ఆయన్ను ప్రశంసించాలన్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. మోదీ ప్రభుత్వ తప్పిదాలను విస్మరించొద్దని అసెంబ్లీలో విపక్ష నేత రమేశ్‌ చెన్నితల అన్నారు. ఆదివారం అలప్పుజలోని హరిపాడ్‌లో చెన్నితల మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేసిన ఒక్కపనిని కూడా కీర్తించాల్సిన అవసరమేమీ లేదన్నారు. థరూర్‌ వైఖరి ప్రజలకు ఆమోదయోగ్యం కాబోదన్నారు. కేరళ పీసీసీ అధ్యక్షుడు రామచంద్రన్‌ మాట్లాడుతూ థరూర్‌ ప్రకటన దురదృష్టకరమని, దీనిపై ఆయనతో మాట్లాడుతానన్నారు. శశిథరూర్‌ ఆదివారం ఒక మలయాళ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తాను జైరాం రమేశ్‌, సింఘ్వీ చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయమేనన్నారు.

193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles