యూపీలో అతిపెద్ద సోలార్ ప్లాంటు


Tue,March 13, 2018 02:18 AM

Modi Macron inaugurate UP biggest solar power plant

-ప్రారంభించిన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
Modi-Macron
దాదర్ కలాన్/ వారణాసి, మార్చి 12: ఉత్తరప్రదేశ్‌లో నెలకొల్పిన అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంటును ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మాక్రాన్‌కు, ఆయన సతీమణి బ్రిగిటేకు తొలుత స్థానిక వైమానిక స్థావరం వద్ద ప్రధాని మోదీ, యూపీ గవర్నర్ రామ్‌నాయక్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. మీర్జాపూర్ జిల్లాలోని చన్వే బ్లాకులో వింధ్యా పర్వత శ్రేణుల్లో ఉన్న దాదర్ కలాన్ గ్రామంలో ఫ్రాన్స్ సంస్థ ఎన్జీ రూ.500 కోట్ల వ్యయంతో ఈ 75 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మించింది. ఈ ప్లాంటులో ఏడాదికి 15.6 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందనిఅధికారులు తెలిపారు. అంతకుముందు, ప్ర ధాని మోదీ ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్‌ఏ) వ్యవస్థాపక సభలో మాట్లాడుతూ, విద్యుత్‌రంగంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వాటాను పెంచడానికి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాయితీలతో కూడి న ఆర్థికసాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ పునరుత్పాదక ఇంధన సంస్థల స్థాపన ఉత్పత్తి సామర్థ్యం 63 గిగావాట్లు మాత్రమే. సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం తక్కువే ఉంటుంది.

Modi-Solar

గంగానదిలో మోదీ, మాక్రాన్ పడవ షికారు


మోదీ, మాక్రాన్ సోమవారం వారణాసి వద్ద గంగానదిలో విహరించారు. ప్రత్యేకంగా అలంకరించిన పడవలో ప్రయాణిస్తూ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ఆలయాల నగరమైన వారణాసి అందాలను తిలకించారు. పడవ వద్ద షెహనాయి సంగీతం, పూల జల్లులతో వారికి ఘన స్వాగతం లభించింది. దశాశ్వమేధ్, అసి ఘాట్‌ల మధ్య ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మాక్రాన్ ఆదివారం తన భార్యతో కలిసి ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి అక్కడ కాసేపు గడిపారు.

401

More News

VIRAL NEWS