బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు


Sat,January 12, 2019 01:54 AM

Modi is not Vajpayee DMK will never align with BJP MK Stalin

- డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటన
- వాజపేయితో మోదీ పోల్చుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా

చెన్నై, జనవరి 11: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను కాలరాసిందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. బీజేపీతో తమ పార్టీ ఎన్నటికీ పొత్తు పెట్టుకోబోదని ఆయన స్పష్టం చేశారు. మోదీ మాజీ ప్రధాని వాజపేయి లాంటివారు కాదని, ఆయన హయాంలో కూడా పొత్తు ఆరోగ్యకరంగా లేదని స్టాలిన్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ గురువారం తమిళనాడులోని తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు కొత్త మిత్ర పక్షాలతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఆసక్తితో ఉన్నట్టు సంకేతాలను ఇచ్చిన నేపథ్యంలో డీఎంకే అధినేత ఈ ప్రకటన చేశారు. రాష్ర్టాల హక్కులను గతంలో ఏ నాయకత్వం హరించనంతగా ప్రధాని మోదీ హరించారు. వాజపేయితో మోదీ తనను తాను పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉన్నది. రాజకీయ అంశాల మీద సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్లనే గతంలో వాజపేయికి డీఎంకే మద్దతు తెలిపింది అని స్టాలిన్ తన ప్రకటనలో తెలిపారు.

461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles