వారికి గుజరాతీలంటే గిట్టదుTue,October 17, 2017 02:07 AM

-పటేల్, మురార్జీలను చిన్నచూపు చూశారు
-కాంగ్రెస్‌ పై ప్రధాని మోదీ ధ్వజం
-జీఎస్టీ నిర్ణయంలో కాంగ్రెస్‌కూ సమానవాటా ఉందని వెల్లడి

గాంధీనగర్, అక్టోబర్ 16: కాంగ్రెస్‌పై, నెహ్రూ-గాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్ అన్నా, గుజరాతీలన్నా నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఏమాత్రం గిట్టదని ఆరోపించారు. గుజరాత్ గౌరవ్ యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం గాంధీనగర్ సమీపంలోని భట్ గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. గుజరాత్‌కు చెందిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మురార్జీ దేశాయ్ వంటి నేతలను కాంగ్రెస్ చిన్నచూపు చూసిందని అన్నారు. తనను జైలులో పెట్టేందుకు కాంగ్రెస్ ఒకప్పుడు కుట్రలు పన్నిందని చెప్పారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై నిర్ణయం తనది మాత్రమే కాదని, ఇదివరకటి కాంగ్రెస్‌కూ ఇందులో సమాన భాగస్వామ్యం ఉందని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ వ్యవస్థపై వ్యాపార వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తపన్నుపై సుమారు 30 పార్టీలను సంప్రదించామని అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందని చెప్పారు.
NarendraModi

187
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS