ప్రధానివి చెత్త రాజకీయాలు!


Tue,April 16, 2019 02:17 AM

Modi discriminating against Punjab govt says Amarinder singh

-జలియన్‌వాలాబాగ్ కార్యక్రమానికి కేంద్రం సహకరించలేదు
-పంజాబ్ సీఎం అమరిందర్‌సింగ్ వెల్లడి
పంజాబ్: జలియన్‌వాలాబాగ్ అమరుల సంస్మరణ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై తనను ఉద్దేశించి గాంధీ భక్త్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్‌సింగ్ ఘాటుగా స్పందించారు. మోదీ చెత్త రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీలా కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాలను నియంతలా శాసించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలను ప్రోత్సహించకుండా కేంద్ర ప్రభుత్వం సమాంతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. నరేంద్రమోదీ గారూ.. కథువాలో జలియన్‌వాలాబాగ్‌పై మీరు చేసిన విమర్శలకు నేను విస్మయం చెందుతున్నాను. మీ డర్టీ పాలిటిక్స్‌కు ఒక బాధాకరమైన విషయాన్ని వాడుకున్నారు.

మేం జలియన్‌వాలాబాగ్ స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వేడుకుంటున్నా మీ ప్రభుత్వం మాకు మద్దతు ఇవ్వకపోగా, రెండేండ్లుగా కావాలని విస్మరిస్తూ సమాంతర కార్యక్రమాన్ని చేపట్టింది అంటూ ట్వీట్ ద్వారా ప్రధానికి బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాన్ని బహిష్కరించి జలియన్‌వాలాబాగ్ అమరులను కాంగ్రెస్ అవమానించిందని ప్రధాని మోదీ ఇటీవల నిందించారు. మన పొరుగువారు, దేశం మొత్తం జలియన్‌వాలాబాగ్ అమరులకు నివాళి అర్పిస్తుంటే, దాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేయకుండా విడిచిపెట్టలేదు అంటూ జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ర్యాలీ సందర్భంగా మోదీ విమర్శించారు. అతను (అమరిందర్‌సింగ్) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి అక్కడికి వెళ్లారు. పార్టీకి, గాంధీ కుటుంబానికి తన విధేయతను ప్రదర్శించడంలో తీరికలేక అధికారిక కార్యక్రమాన్ని ఆయన బహిష్కరించారు. అమరిందర్‌సింగ్ నాకు చాలాకాలంగా తెలుసు, ఆయన దేశభక్తిని నేనెప్పుడు ప్రశ్నించలేదు అని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ జలియన్‌వాలాబాగ్ ట్రస్ట్ చైర్మన్ అయి ఉండి ఇలా వ్యాఖ్యానించడం నిజంగా విస్మయం కలిగించే విషయం అని సింగ్ వ్యాఖ్యానించారు.

134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles