ఈడీ విచారణకు రాజ్‌ఠాక్రే


Fri,August 23, 2019 02:47 AM

MNS chief Raj Thackeray leaves ED office after over 8 hours of questioning

- ముంబైలో 144 సెక్షన్.. పలువురు ఎమ్మెన్నెస్ నేతల అరెస్ట్
ముంబై, ఆగస్టు 22: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్&ఎఫ్‌ఎస్) నుంచి తీసుకున్న రుణం చెల్లింపుల్లో అవతకవకలపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్‌ఠాక్రేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు ఎనిమిదిన్నర గంటలు విచారించింది. గురువారం మధ్యాహ్నం 11.25 గంటలకు ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించిన రాజ్‌ఠాక్రే రాత్రి 8.15 గంటలకు బయటకు వచ్చారు. శివసేన సీనియర్ నేత మనోహర్ జోషి తనయుడు ఉన్మేష్ జోషితో కలిసి ఏర్పాటుచేసిన కోహినూర్ సీటీఎన్‌ఎల్ అనే సంస్థలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై స్పష్టత కోసం రాజ్‌ఠాక్రేను ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు అనుమతించినట్లు చెప్పారు.

ఈడీ కార్యాలయం వరకు భార్య షర్మిల, కొడుకు అమిత్, కోడలు మైథిలీ, కూతురు ఊర్వశిలతో కలిసి వచ్చిన రాజ్‌ఠాక్రే.. లోపలికి ఒక్కరే వెళ్లగా, కుటుంబ సభ్యులు సమీపంలోని ఒక హోటల్‌లో బసచేశారు. మరోవైపు రాజ్‌ఠాక్రేకు పూర్తిగా మద్దతునిస్తామని తమ అధినేత ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించారని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెన్నెస్‌కు చెందిన 10 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీ కార్యాలయంతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles