సోషల్ మీడియాలో నా పేరిట నకిలీ లేఖ


Tue,April 16, 2019 01:49 AM

MM Joshi writes EC to probe on circulation of fake letter in his name

-విచారణ జరుపాలని ఈసీని కోరిన బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకత్వంపై విమర్శలతో తాను రాసినట్టు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న నకిలీ లేఖపై విచారణ జరుపాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)ను బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కోరారు. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీకి జోషి పేరిట రాసిన నకిలీ లేఖ ఒకటి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది. ఆ లేఖ తాను రాయలేదని, దీనిపై దర్యాప్తు జరిపించాలని ఈసీ ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు రాసిన లేఖలో జోషి డిమాండ్ చేశారు. నేను అద్వానీకి లేఖ రాశానని నిన్నటి (ఆదివారం) నుంచి పలువురు మీడియా మిత్రులు నాకు ఫోన్‌చేసి అడుగుతున్నారు. ఆ లేఖ సోషల్ మీడియాలో షేరవుతున్నది. నేను ఆ లేఖ లో వివరాలను చదివాను. కానీ అలాంటి లేఖను అద్వానీ జీకి ఎప్పు డు రాయలేదు. సోషల్ మీడియాలోకి ఆ లేఖ ఎలా వచ్చిందో పరిశీలించండి అని సునీల్ అరోరాకు రాసిన లేఖలో జోషి తెలిపారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున గాంధీనగర్ నుంచి ఎల్ కే అద్వానీ, కాన్పూర్ నుంచి మురళీ మనోహర్ జోషి ఎన్నికయ్యారు. కానీ వారిద్దరికీ బీజేపీ నాయకత్వం ఈ దఫా ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేదు.

100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles