మిస్ ఇండియాగా రాజస్థానీ సౌందర్యం


Mon,June 17, 2019 01:42 AM

Miss India 2019 Rajasthan Suman Rao Wins Beauty Pageant

-రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ యువతి
ముంబయి, జూన్ 16: ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని సుమన్ రావు కైవసం చేసుకున్నారు. దీంతో 2019 డిసెంబర్‌లో థాయిలాండ్‌లో జరిగే ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం తరపున మిస్ ఇండియా సుమన్ రావు ప్రాతినిథ్యం వహించనున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ యువతి ప్రస్తుతం సీఏ విద్యను అభ్యసిస్తున్నారు. 2019 మిస్ ఇండియా రన్నరప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్ నిలిచారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్ మిస్ గ్రాండ్ ఇండియా 2019 కిరీటాన్ని చేజిక్కించుకోగా, మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019 కిరీటాన్ని బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్ గెలుచుకున్నారు. ముంబయిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
sanjana
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, నటీనటులు హిమాఖురేషీ, చిత్రాంగధసింగ్, ఆయుష్ శర్మ, ఫ్యాషన్ నిపుణుడు ఫాల్గుణి పికోకా, భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. దర్శకుడు కరణ్‌జోహర్, నటుడు మనీష్‌పాల్, 2017 ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌లు వ్యాఖ్యాతలుగా.. బాలీవుడ్ నటీనటులు కత్రినాకైఫ్, విక్కీకౌషల్, మౌనీరాయ్ తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు.

896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles