కశ్మీర్ సరిహద్దులో ఉగ్రదాడిTue,January 10, 2017 02:28 AM

జమ్ము/న్యూఢిల్లీ, జనవరి 9: జమ్ములోని అఖ్నూర్ సెక్టర్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఏడాది తొలి ఉగ్రవాద దాడి ఇదే. నియంత్రణ రేఖకు సమీపంలో జరిగిన ఈ దాడిలో జనరల్ ఇంజినీరింగ్ రిజర్వ్‌ఫోర్స్ (జీఆర్‌ఈఎఫ్) క్యాంపులో పని చేస్తున్న ముగ్గురు కూలీలు చనిపోయారు. మరో కూలీకి గాయాలయ్యాయని రక్షణశాఖ పీఆర్వో మనీశ్ మెహతా తెలిపారు. అక్కడ పని చేస్తున్న కూలీలతోపాటు జీఆర్‌ఈఎఫ్ సిబ్బంది అందరినీ సైన్యంకాపాడిందని ఆయన చెప్పారు. ఈ దాడిలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తున్నది. నియంత్రణ రేఖకు సమీపంలోని బత్తాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Kashmeer
దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సరిహద్దు దాటుకుని భారత్‌లో ప్రవేశించారని సైనికవర్గాలు పేర్కొన్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్ నుంచి సరిహద్దు దాటి భారత్‌లో ప్రవేశించారనేందుకు ఆధారాలు ఉన్నాయని పీఎంవో మంత్రి జితేంద్రసింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నామని సైనికవర్గాలు తెలిపాయి. గతేడాది నవంబర్ చివరివారంలో జమ్ములోని నగ్‌రోటా సైనిక శిబిరంపై దాడి చేసిన ఉగ్రవాదులు ఇద్దరు మేజర్‌లు సహా ఏడుగురు సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. 19 మంది సైనికుల మృతికి కారణమైన యురీ ఘటన తర్వాత అతిపెద్ద ఉగ్రవాద ఘటన అదే.

అఖ్నూర్ సెక్టర్‌లో జరిగిన దాడిని జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఘటనలో చనిపోయిన కూలీల కుటుంబాలకు ఆమె సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో రక్తపాతాన్ని, హింసను నివారించేందుకు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ నొక్కి చెప్పారు.

768
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS