సరిహద్దుల్లో ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు


Sat,January 12, 2019 02:02 AM

Militants attack CRPF bunker in the heart of Srinagar

-ఆర్మీ మేజర్, సైనికుడు మృతి
-పాక్ కాల్పుల్లో ఆర్మీ పోర్టర్ మరణం

జమ్ము, జనవరి 11: భారత సైనికుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఉగ్రవాదులు మారోమారు పెట్రేగిపోయారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) పేల్చడంతో ఆర్మీ మేజర్, ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ విధుల్లో భాగంగా శుక్రవారం నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద సైనికులు గస్తీ తిరుగుతుండగా ఉగ్రవాదులు ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో మేజర్, సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారు దవాఖానలో కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు. మరో ఘటనలో రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో పాక్ సైనికులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆర్మీ పోర్టర్ హేమరాజ్ మరణించారు. గత నాలుగు రోజులుగా రాజౌరి, ఫూంచ్ జిల్లాల్లో ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ పాక్ సైనికులు నిరంతరాయంగా కాల్పులు జరుపుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన భారత సైనికులు కాల్పులతోనే పాక్‌కు గుణపాఠం చెప్పారు. మరోవైపు శ్రీనగర్‌లోని సీఆర్పీఎఫ్ బంకర్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. లాల్‌చౌక్ సిటీ సెంటర్ సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ బంకర్‌పై మిలిటెంట్లు గ్రనేడ్ దాడి చేశారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు వివరాలు అందలేదని పోలీసులు చెప్పారు.

432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles