మెహబూబా కాన్వాయ్‌పై రాళ్లదాడి


Tue,April 16, 2019 01:44 AM

Mehbooba Mufti cavalcade stoned in Anantnag

శ్రీనగర్, ఏప్రిల్ 15: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రయాణిస్తున్న వాహన కాన్వాయ్‌పై ఖిరాం ప్రాంతంలో కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఎన్నికల ప్రచా రానికి వచ్చిన మెహబూబా స్థానిక ముస్లింలతో ప్రార్థనలు జరిపి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆమెకు ఎటువంటి గాయం కాలేదు. ఆమెకు భద్రత కల్పిస్తున్న స్పెషల్ సెక్యూరిటీ గార్డ్ (ఎస్సెస్జీ) ఒకరు గాయపడ్డారు. ముఫ్తీ కాన్వాయ్‌లోని ఒక వాహనం దెబ్బ తిన్నది. అక్కడే ఉన్న పోలీసులు యువకులను వెంటాడి పట్టుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఆమె పట్ల ఆగ్రహంతోనే యువకులు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

86
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles