కాంగ్రెస్ కూటమి యత్నానికి చుక్కెదురు


Fri,September 21, 2018 01:47 AM

Mayawati announces alliance with Ajit Jogis party

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో అజిత్‌జోగి పార్టీతో బీఎస్సీ పొత్తు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయ తలపెట్టిన కాంగ్రెస్ కూటమి యత్నాలకు బీఎస్పీ అధినాయకురాలు మాయావతి గండికొట్టారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్‌జోగి నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ (సీజేసీ)తో కలిసి పోటీ చేసేందుకు ఆమె నిర్ణయించారు. బీఎస్పీ, సీజేసీ పొత్తుకు అంగీకారం కుదిరిందని గురువారం లక్నోలో విలేకరుల సమావేశంలో మాయావతి తెలిపారు. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీఎస్పీ 35 స్థానాలకు, సీజేసీ 55 స్థానాలకు పోటీ చేస్తాయని, ఎన్నికల్లో గెలిస్తే అజిత్‌జోగి ముఖ్యమంత్రి అవుతారని ఆమె పేర్కొన్నారు. రెండు పార్టీల పొత్తు బీజేపీని రాష్ట్రంలో నిలువరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ కలిసి వచ్చే ఇతర ప్రాంతీయ పార్టీల సహాయం తీసుకుంటామన్నారు. బీజేపీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నా ఛత్తీస్‌గఢ్‌కు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 22 మంది అభ్యర్థుల జాబితాను బీఎస్పీ విడుదల చేసింది.

451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles